13-12-2024 02:06:39 AM
కరీంనగర్, డిసెంబరు 12 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని ఖాన్‌పూర్‌లో ఎక్సైజ్ పోలీసులు 403 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. ఎక్సైజ్ సీఐ కే నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్సైజ్ సిబ్బంది గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎండీ రహీం, సయీద్ షోయబ్ అక్తర్‌నుసోదా చేశారు. వారి నుంచి 403 గ్రాముల ఎండు గంజాయి పట్టుకున్నారు. రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేయించారు.