22-07-2025 01:26:20 AM
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాం తి): స్థానిక ఎన్నికలు నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల నిర్వహణకు కూడా సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికలకు ఉన్న అన్ని రకాల అడ్డంకులను తొలగించేందుకు ప్ర భుత్వం కసరత్తు చేస్తున్నది. త్వరలోనే స్థాని క సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ కానున్నది.
ఈ నేపథ్యంలో పల్లెల్లో రాజకీయం వేడెక్కుతున్నది. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఒకవైపు స్థాని క ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండటంతో బరిలో నిలిచేందుకు ఆశావహు లు టిక్కెట్ దక్కించుకునే పనిలో పడ్డారు. దానికి అనుగుణంగా గ్రామాల్లో ఓట్లను తమవైపు తిప్పుకునే దిశగా పావులు కదుపుతున్నారు.
అయితే టికెట్ల కోసం పార్టీ కీలక నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా పోటీలో నిలిచి గెలవాలనే పట్టుదలను అభ్యర్థులు కనబరుస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదేతరహా పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ క్రమంలో గ్రామా ల్లో స్థానిక ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది.
అధికార కాంగ్రెస్‌లోనే పోటీ ఎక్కువ..
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో గ్రా మాల్లో పార్టీల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ఆ పార్టీ నాయకుల్లో ఎక్కువమంది పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు టిక్కెట్లు ఆశి స్తున్న వారు, ఎవరికి టికెట్లు ఇస్తే విజ యం సాధిస్తారనే అంశాలను సేకరిస్తున్న ట్టు తెలుస్తోంది.
అయితే ఏళ్ల తరబడి పార్టీ లో పనిచేస్తున్న వారు టికెట్లను ఆశిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పోటీలో ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఒకవేళ మహిళకు వస్తే ఆయా నాయకులు వారి ఇంట్లోని ఆడవారికి టిక్కెట్ ఇప్పించుకునే విధంగా పావులు కదుపుతున్నట్టు చర్చ జరుగుతుం ది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ నేతలు సైతం మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వద్దకు వెళ్లి టికెట్లు అడుగుతున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీఆర్‌ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. పార్ల మెంట్ ఎన్నికల్లో పెద్దఎత్తున దెబ్బతిన్న బీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థా నాలు గెలిచి మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. బీఆర్‌ఎస్ అధినాయకత్వం స్థా నిక ఎన్నికల్లో సానుకూల ప్రభావం ఉందని భావిస్తున్న నేపథ్యంలో టిక్కెట్లు ఆశించే వారు పెరుగుతున్నారు.
ఈ క్రమంలోనే టికె ట్ ఆశిస్తున్న నేతలు ఆయా పార్టీల నాయకత్వం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపు పక్కన పెడితే ఆశావహులు ఇప్పటికే గ్రామాల్లో వార్డుల వారీగా దృష్టి సారించి ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డారు. అయితే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను పాత రిజర్వేషన్లతో నిర్వహిస్తుందా లేదా కొత్త రిజర్వేషన్లతో నిర్వహి స్తుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
స్థానిక ఎన్నికలపై బీసీల ఆశలు
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతను ఇచ్చింది. దీంతో బీసీ కులాలకు చెందిన ఆశావాహు లు పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమం లో రాష్ర్ట ప్రభుత్వం సైతం బీసీలకు సముచిత స్థానాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి వేదికగా బీసీలకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
అదే సమయంలో తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ బీసీ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో బీసీలకు 23 శాతమే రిజర్వేషన్ కల్పించినప్పటికీ బీసీ కులస్తులు తమ ప్రభావాన్ని చాటారు.
ఈసారి ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌లను ఆర్డినెన్స్ మార్గంలో అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో బీసీల ప్రాతినిథ్యం మరింతగా పెరుగుతుందని బీసీ నా యకులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ అ వకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని రాజకీయంగా బీసీ ప్రాతినిథ్యం మ రింత పెంచుకోవాలని బీసీ వర్గాలు యోచిస్తున్నాయి.
ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ ?
రాష్ర్ట ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపిన విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ర్ట ఎన్నికల కమిషన్‌కు పంపేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండో విడతలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలకు కంప్లీట్ చేయాలని ఇప్పటికే కోర్టు సూచించడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ర్ట ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తికాగానే గరిష్టంగా 30 రోజుల్లో పరిషత్, సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ కరసత్తు చేస్తోంది. అయితే ఈ నెల చివరి వారంలో లేక, ఆగస్టు మొదటివారంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం.
కీలకం కానున్న సంక్షేమ పథకాలు
బీసీలకు 42 శాతం అంశం కొలిక్కి వస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు మా ర్గం సుగమమం అవుతున్నది. అయితే స్థాని క ఎన్నికల్లో సంక్షేమ పథకాలు కీలకంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అ మలు చేస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయా ణం వంటి పథకాలు స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి మైలేజ్ తీసుకొస్తాయని అధికార పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ము ఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేలా కార్యాచరణను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను పూర్తిస్థాయిలో వినియోగించుకొని భవిష్యత్‌లో నిర్వహించే అన్ని ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాల్లో గెలుపు సాధించాలనే ఆలోచనలో ప్రభు త్వం ఉన్నది. సంక్షేమ పథకాలన్నీ అమలవుతూ ప్రజల్లో సానుకూల దృక్పథం ఉన్నందున్న ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అధికార పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. దీనినే ప్రధానంగా ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటుంది.