25-01-2026 12:17:14 AM
బూర్గంపాడు, జనవరి 24 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని సార పాక పల్లె ప్రకృతి వనం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి పట్టుబడ టంతో ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మేడా ప్రసాద్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సారపాక పల్లె ప్రకృతి వనం వద్ద ఎస్‌ఐ నాగభిక్షం సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పక్కా గంజాయి సరఫరా జరుగుతుందని ముందస్తు సమాచారం ఉండడంతో పకడ్బందీగా వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు అను మానాస్పదంగా ఉండి పోలీస్ సిబ్బందిని చూసి పారిపోయారు.
వెంటనే అనుమానం వచ్చి వెంబడించి షేక్ సాదిక్,సయ్యద్ మౌలాలి,బెజవాడ గోపి పట్టుకొని తనిఖీ చేయగా 3.2 కేజీల గంజాయి పట్టుబడింది. డొంకరాయ్ నుంచి ఖమ్మం పట్టణానికి తీసుకువెళ్తున్నట్లు పట్టుబడిన నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.వారిని బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించి ముగ్గురు పై కేసు నమోదు చేయగా,మరో ఇద్దరు పరారిలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.