calender_icon.png 7 August, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

06-08-2025 01:26:21 AM

- ఇద్దరు అరెస్ట్, ప్రధాన సూత్రధారులు పరార్

- ఒడిశా టు యూపీ వయా హైదరాబాద్ సాగుతున్న స్మగ్లింగ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (విజయక్రాంతి): రాష్ర్టంలో మాదకద్రవ్యాల రవాణాపై ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈగల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్‌కు, తెలంగాణ మీదుగా సాగుతున్న భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. రూ.4.2 కోట్ల విలువైన 847 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఒడిశాకు చెందిన ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు.

మల్కన్‌గిరి నుంచి ఉత్తరప్రదేశ్‌కు సాగుతున్న ఈ ప్రధాన సరఫరాపై విశ్వసనీయ సమాచారం ఆధారంగా సోమవారం శంషాబాద్ రోడ్డు సమీపంలో అధికారులు నిఘా ఉంచారు. అనుమానాస్పదంగా వస్తున్న ఓ పికప్ వాహనాన్ని తనిఖీ చేయగా 847 కేజీల గంజాయి బయటపడింది. వాహనంలో ఉన్న ఖిల్లా ధన, రాజేందర్ బి అనే ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరికి చెందిన రమేష్ సుక్రి ఈ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.

అతని ప్రధాన అనుచరుడైన జగదీష్ కుల్దీప్, అక్కడి మారుమూల అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేసే శిబో, బసు వంటి వారి నుంచి పెద్దమొత్తంలో సరుకును కొనుగోలు చేస్తాడని వివరించారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారులు రమేష్ సుక్రి, జగదీష్, షఫ్ఫిక్‌ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు.