calender_icon.png 10 August, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడిన హత్య కేసు మిస్టరీ.. వివాహేతర సంబంధమే హత్యకు కారణం

06-08-2025 01:26:36 AM

కరీంనగర్, ఆగస్టు05(విజయక్రాంతి): కరీంనగర్ నగర శివారులోని బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన జరిగిన హత్య కేసు మిస్టరీని కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని దర్యాప్తులో తేలింది. ఈ కే సులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

జు లై 29న సుభాష్ నగర్ కు చెందిన ఐలవేణి సంపత్ (45) రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రంథాలయం లో స్వీపర్గా పనిచేసిన సంపత్, తన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కే సు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఐలవే ణి రమాదేవి (38)పై అనుమానం రావడం తో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.

రమాదేవికి కిసాన్ నగర్ కు చెందిన కర్రె రాజయ్య (50) తో వివాహేతర సంబం ధం ఉంది. భర్త సంపత్ మద్యానికి బానిస కావడంతో తరచూ రమాదేవిని కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన రమాదేవి, రాజయ్య, తన దూరపు బంధువైన కీసరి శ్రీనివాస్ (35) (ఖాదర్ గూడెం) లతో కలిసి సంపత్ను హత్య చేయాలని ప్లాన్ వేసింది. ప్లాన్ ప్ర కారం, రాజయ్య, శ్రీనివాస్ కలిసి సంపత్ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రమ్మని చెప్పి, అ క్కడ మద్యం తాగారు.

సంపత్ పూర్తిగా మ త్తులోకి వెళ్లిన తర్వాత, రమాదేవి ఫోన్ చేసి అతడిని చంపమని చెప్పింది. రమాదేవి ఆదేశాల మేరకు రాజయ్య, శ్రీనివాస్ తమ వెం ట తెచ్చుకున్న గడ్డి మందు (హెర్బిసైడ్)ను సంపత్ చెవిలో పోసి హత్య చేశారు. సంపత్ చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుం చి వెళ్లిపోయారు.ఆ తర్వాత, రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ ముగ్గురూ కలిసి సంప త్ కోసం వెతుకుతున్నట్లు నటించారు.

చివరికి సంపత్ మృతదేహం ఉన్న ప్రాంతాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నే రాన్ని అంగీకరించారు. కర్రె రాజయ్య (50) @ రాజు @ రాజన్న, కిసాన్ నగర్ కీసరి శ్రీనివాస్ (35), ఖాదర్ గూడెం ఐలవేణి ర మాదేవి (38), బుట్టి రాజారాం కాలనీ (మృతుడి భార్య).

లను అరెస్ట్ చేసిహత్యకు ఉప యోగించిన రెండు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లను, మద్యం బాటిళ్లు , గడ్డి మందు (హెర్బిసైడ్) డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన కరీంనగర్ రూరల్ పోలీసులు, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్త్స్ర లు తాండ్ర నరేష్, లక్ష్మా రెడ్డి వారి బృందాన్ని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగాఅభినందించారు.