ఇజ్రాయెల్‌లో తాపీమేస్త్రీ ఉద్యోగాలు!
వేతనం నెలకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.38 లక్షల వరకు
హైదరాబాద్, 18 మే (విజయక్రాంతి): ఇజ్రాయెల్‌లో నిర్మాణ కార్మికుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ లిమిటెట్( టామ్‌కమ్) తెలిపింది. ఈమేరకు టామ్‌కమ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసిం ది. టామ్‌కమ్ అనేది తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖకు చెందిన రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ. ఇజ్రాయెల్‌లో నిర్మాణ కార్మికులకు మంచి డిమాండ్ ఉందని, ఆసక్తి ఉన్నవారిని నియమించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పింది.
షట్టరింగ్ కార్పెంటర్లు, సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, ఐరన్ బెండింగ్ పనులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని, నెలకు రూ.1.20లక్షల నుంచి రూ.1.38లక్షల వరకు జీతం చెల్లిస్తారని వెల్లడించింది. దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై, నిర్మాణ రంగంలో కనీసం మూడేళ్లు అనుభవం ఉండాలని సూచించింది. వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలని చెప్పింది.
దరఖాస్తుదారులకు ఇజ్రాయెల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వృత్తిపరమైన స్కిల్ టెస్టు నిర్వహిస్తారని, అందులో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తారని తెలిపింది. స్కిల్ టెస్టు రాయాలనుకునే అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లోని నేషనల్ కన్‌స్ట్రక్షన్ అకాడమీకి రావాలని టామ్‌కమ్ సూచించింది. మరిన్ని వివరాలకు www.tomcom. telangana.gov.inని సందర్శించాలని లేదా 7893566493/ 8247838789/9849639539 నెంబర్లకు సంప్రదించాలని చెప్పింది






