06-12-2025 06:21:51 PM
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్: నగరంలోని వేపురిగేరిలో అయ్యప్ప మాలధారణ చేసిన భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి సామూహిక మహా పడిపూజ శనివారం భక్తి శ్రద్ధలతో జరిగింది. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో మార్మోగి ఆధ్యాత్మిక కనిపించింది. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప సేవా సమితి సభ్యులు ఎమ్మెల్యేకు శాలువాతో ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సేవలో ప్రజలు చూపుతున్న ఏకాగ్రత నియమ నిష్ఠలు ప్రశంసనీయం అని అన్నారు. మహబూబ్ నగర్ లో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా, అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు శ్రీనివాస్, నాగరాజు, హన్వేశ్ గురుస్వామి, యాదయ్య గురుస్వామి, ముత్యం గురుస్వామి, రాజు గురుస్వామి, తదితరులు పాల్గొన్నారు.