calender_icon.png 6 December, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు..

06-12-2025 06:53:44 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లంబాడీతండా(డి) గ్రామ శివారులోని గుడుంబా స్థావరాలపై శనివారం దేవాపూర్ ఎస్ఐ గంగారం ఆధ్వర్యంలో దాడులు చేశారు. గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా తయారు చేస్తున్నారని సమాచారం మేరకు 1500 వందల లీటర్ల బెల్లం పానకంతో పాటు సామగ్రి ధ్వంసం చేశారు. అనంతరం గ్రామస్థులతో ఎస్ఐ గంగారం మాట్లాడారు. గ్రామంలో గుడుంబా తయారు చేసిన, విక్రయిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో నిరంతరం నిఘా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.