06-12-2025 06:36:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో విగ్రహాల పునః ప్రతిష్టాపన కార్యక్రమానికి మహానిధి సేకరణలో భాగంగా నిర్మల్ పట్టణ వెండి బంగారు వర్తక సంఘం నుండి 3,11,000/- రూపాయలు సంఘం సభ్యులు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ మధిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శనివారం బంగారం వెండి వర్తక సభ్యులను శాలువాతో సన్మానించారు. ఇదిలా ఉండగా మను బ్రహ్మ (కమ్మరి) సంఘం అధ్యక్షులు వేములవాడ జగదీష్ గణపతి విగ్రహం కోరకు 36 వేలు అందజేశారు. దాతలంరీకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకుంటూన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు కమ్మరి కర్ర సంఘం వెండి బంగారం వర్తక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.