06-12-2025 06:44:18 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న స్వర్గీయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్థంతి వేడుకలను శనివారం ఘట్ కేసర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అంబేడ్కర్ యువజన సంఘం, ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, పలు పార్టీల నాయకులు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి భారతీయుడు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాస్, ఎమ్ఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మీసాల మల్లేష్, బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాలు యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు మెరుగు నరేష్ గౌడ్, రైతు సొసైటీ మాజీ చైర్మన్ సార శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, మాజీ కౌన్సిలర్ లు కడపోల్ల మల్లేష్, జహంగీర్, అంబేడ్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి ఇరిటపు శ్రీనివాస్, నాయకులు వై. సత్యనారాయణ, అల్లు కమలాకర్, రాందాస్, గడ్డం శ్రీనివాస్, మీసాల అరుణ్, ఎం. సునీల్, యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.