calender_icon.png 6 December, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికైన సర్పంచ్ కు ఎమ్మెల్యే అభినందన

06-12-2025 06:46:44 PM

నిర్మల్ (విజయక్రాంతి): సొన్ మండలం లోకల్ వెల్మల్ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ చాత్రి గంగాధర్, ఉప సర్పంచ్ జక్క ప్రశాంత్, వార్డు మెంబర్ లు దేశెట్టి పోషెట్టి, బెల్లాల రాజేశ్వర్, జక్క పల్లవి నితీష్, చాత్రి భారతీ భీమేష్, గడ్చంద పవన్ కుమార్, సుంకరి లక్ష్మీ చిన్నయ్య, చాత్రి దివ్య గంగయ్య లు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సరికెల గంగన్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, తాజా మాజీ ఎంపీపీ హరీష్ రెడ్డితో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలు చేరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.