calender_icon.png 6 December, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మర తనిఖీలు.. ముగ్గురికి జరిమానా

06-12-2025 06:27:04 PM

సిద్దిపేట క్రైం: మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి న్యాయమూర్తి రూ.30 వేల 5 వందల జరిమానా విధించారని సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇటీవల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో వెల్లడైందన్నారు. వారిని శనివారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరచగా, జరిమానా విధించారని తెలిపారు.