29-11-2024 07:57:14 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లిలో డిసెంబర్ 4న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు పెద్దఎత్తున జన సమీకరణ చేపట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోరారు. పెద్దపల్లి పర్యటన నేపథ్యంలో జన సమీకరణపై ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్, జూలపల్లి మండలాలలోని ముఖ్య నాయకులతో శుక్రవారం ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపల ప్రకాష్ రావు పలు మండలలా నాయకులు తదితరులు పాల్గొన్నారు.