calender_icon.png 25 September, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి

29-11-2024 07:52:44 PM

అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సి.రాజు

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఏఆర్ పోలీసులు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని రామగుండం కమిషనరేట్ అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సి .రాజు కోరారు. శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లిలోని ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్ ను ఆయన సందర్శించారు. సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించి ఏఆర్ పోలీసుల ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, సేర్మోనల్ డ్రిల్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ ను పరిశీలించారు. పోలీసులు క్రమశిక్షణతో విధులను నిర్వర్తించి ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట ఏ ఆర్ ఏసీపి సుందర్ రావు, ఆర్ఐ వామనమూర్తి లు ఉన్నారు.