25 July, 2026 | 5:24 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

టీఆర్‌పీలో భారీ చేరికలు

16-05-2026 01:43 AM

జిల్లా అధ్యక్షులు రవి పటేల్

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 15 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ తెలిపారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరుపేద ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా పెట్టుకుందన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రజలకు విద్యా, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.

పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ప్రజల పక్షాన నిలబడి రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం కృషి చేస్తున్నారని, తెలంగాణలోని బహుజన ప్రజలంతా పార్టీకి అండగా నిలుస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి యువకుడు మరో 100 మందిని ప్రభావితం చేస్తూ భూపాలపల్లిలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పార్టీ విధి విధానాలకు కట్టుబడి, పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి పేద ప్రజల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల వెంకటేష్, ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్ పాల్గొన్నారు.