బంజారాహిల్స్‌లో భారీ చోరీ
70 తులాల బంగారం అపహరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి) : బంగారం ధర పెరుగుతున్న వేళ బంజారాహిల్స్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన భారీ దొంగతనం కలకలం రేపింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 8లో నివాసముంటున్న గోపాల్‌దాస్ అగర్వాల్ అనే వస్త్ర వ్యాపారి కుటుంబస భ్యులు నెల రోజుల క్రితం సుమారు 70 తులాల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు కొనుగోలు చేసి ఇంట్లోని అల్మారాలో పెట్టారు.
బిస్కెట్లలో కొన్నింటిని కరిగించి నెక్లెస్‌లు, గాజు లు, తదితర వస్తువులు తయారు చేయించి వాటిని బెడ్‌రూమ్‌లోని అల్మారాలో భద్రపరిచారు. కాగా ఫంక్షన్‌కు వెళ్లడం కోసం గోపాల్‌దాస్ కుటుంబసభ్యులు సిద్ధమవుతు న్న క్రమంలో అల్మారాలోని ఆభరణాల కోసం చూడగా అవి కనిపించ లేదు. దీంతో గోపాల్‌దాస్ గురువా రం రాత్రి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులను విచారిస్తున్నట్లు సమాచారం.






