18-10-2025 07:33:36 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన రేణుక దేవి ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి వెళ్ళగా దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 23 తులాల బంగారం అరకిలో వెండిని దూసుకెళ్లినట్టు బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంఘటస్థలని స్థానిక సీఐ సందర్శించి క్లూస్ టీం ద్వారా నేరస్తులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.