22-12-2025 03:58:37 PM
నిర్మల్,(విజయక్రాంతి): పట్టణంలోని స్థానిక పాఠశాలలైన శ్రీ సరస్వతి శిశు మందిర్ బుధవార్ పేట్ పాఠశాలలో గణిత దినోత్సవం( శ్రీనివాస రామానుజన్ జయంతి) ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి అయిన శ్రీ ముదుల్కర్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలు కొనియాడారు విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు, ఆచార్యులు, పాఠశాల కార్యదర్శి ముదుల్కర్ శ్రీకాంత్ , పాఠశాల పూర్వ విద్యార్థి అయిన చొక్కాపురం వెంకటరమణ గారు పాల్గొన్నారు అని పాఠశాల ప్రధానాచార్యులు కొండూరు నరేష్ గారు తెలియజేశారు.