22-12-2025 05:35:37 PM
నిర్మల్,(విజయక్రాంతి): సోను మండలంలోని పాకుపట్ల ఉన్నత పాఠశాలలో సోమవారం గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు గణిత శాస్త్రంలో సూత్రాలు బొమ్మలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయుడు తోడిశెట్టి రవికాంత్ ఉపాధ్యాయులు ఉన్నారు