22-12-2025 05:39:59 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన బొట్టుపల్లి గోపాల్ ప్రమాణ స్వీకార అనంతరం మొదటి రోజు నుండే గ్రామ పంచాయతీ సమస్యల పరిష్కారంలో నిమగ్నం అయ్యారు. మోతుగూడ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గల త్రాగు నీటి బావిలో భక్తుల సౌకర్యార్థం నీళ్ళ మోటారు వేయించారు. దీంతో గ్రామస్థులు ఆయనను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలోని సమస్యలను ఒక్కొకటిగా పరిష్కరిస్తానని గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పవన్ కుమార్, కార్యదర్శి రాందాస్, వార్డు సభ్యులు శ్రీకాంత్, రాజేందర్, రమేష్, బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు సప్త శ్రీనివాస్, బాపు, నాందేవ్, ఆత్మరాం తదితరులు పాల్గొన్నారు.