24-05-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
కుత్బుల్లాపూర్, మే 23(విజయ క్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేటలోని డాలర్ మెడోస్ నందు గల శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన తృతీయ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమానికి బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దయతో ప్రజలంతా సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బ్రహ్మోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బెంబడి బుచ్చిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మురళి యాదవ్, చింతా మల్లేష్, క్రిష్ణా రెడ్డి, బల్వంత్ రెడ్డి, సునీల్ కుమార్, అనంత్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్, నరసింహ శర్మ, రామకృష్ణ, లింగారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మధుసూదన్ రావు, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.