calender_icon.png 11 July, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

11-07-2025 12:00:00 AM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబు

మహదేవపూర్, జులై 10 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా తన స్వగ్రామం కాటారం మండలం ధన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు, సహస్ర నామార్చన వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. 

అనంతరం శ్రీపాద వల్లభుడైన దత్తాత్రేయ స్వామి క్షేత్రంలో శీను బాబు దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదం అందించారు. అనంతరం  శీను బాబు మాట్లాడుతూ శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని, ఆ దత్తాత్రేయున్ని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక భజనల తోపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.