10-07-2025 11:25:05 PM
మంథని (విజయక్రాంతి): మండలంలోని చిల్లపల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొట్ల ప్రవీణ్ తండ్రి బొట్ల శంకరయ్య స్మారకార్ధం క్రికెట్ టోర్నమెంట్ ను రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu), టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాలతో చిల్లపల్లిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను మంథని మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బెస్తపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మేడి నరేష్, గాజులపల్లి ఉపసర్పంచ్ దాడి క్రాంతికుమార్, సిరిపురం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కపాక శ్రావణ్, దుబ్బపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుమ్మరి గణేష్, గుంజపడుగు యూత్ అధ్యక్షులు మబ్బు శ్రీనివాస్, సూరయ్యపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రు విజయ్, యూత్ కాంగ్రెస్ నాయకులు బూడిద రమేష్, ఫహీం, వినయ్, అయితా సదన్, మంథని యూత్ కాంగ్రెస్ నాయకులు ముక్కు చిల్లపల్లి యూత్ కాంగ్రెస్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.