01-05-2025 03:09:28 PM
ఘనంగా మేడే వేడుకలు
మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రపంచ కార్మికుల దినోత్సవం(World Workers' Day) మేడే వేడుకలను మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఎరుపు రంగు దుస్తులు, ఎర్రజెండాలతో శోభాయాత్ర నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం పూర్తిగా ఆయా కార్మిక సంఘాల ర్యాలీలతో అరుణ వర్ణంగా మారింది.
సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏఐసిటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే డే వేడుకలను పండగగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో ఆయా కార్మిక సంఘాల నేతలు అరుణ పతాకాలను ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం అమరులైన నేతలను గుర్తు చేసుకున్నారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సైతం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.