01-05-2025 08:58:24 PM
ఖమ్మంపల్లిలో వేబ్రిడ్జిని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎల్ పీఓ సతీష్...
ముత్తారం (విజయక్రాంతి): పర్మిషన్ లేకుండా వేబ్రిడ్జి ఏర్పాటు చేస్తే సీజ్ చేస్తామని మంథని డిఎల్ పిఓ సతీష్ కుమార్ తెలిపారు. మండలంలోని ఖమ్మంపల్లిలో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన వేబ్రిడ్జి కాంటాను గురువారం డిఎల్ పీఓ సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామస్తులు ఎలాంటి అనుమతులు లేకుండా వేబ్రిడ్జి నిర్మించారని ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేసినట్టు ఆయన తెలిపారు.
వే బ్రిడ్జిపై విచారణ జరిపి కాంటాకు అనుమతులు ఉన్నాయా లేదా అని విచారణ చేసి తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ కార్యదర్శి బద్రీనాథ్కు సంబంధిత కాంటకు సంబంధించిన పేపర్లు ఇవ్వాలని ఆదేశించారు. గత వారం క్రితం కాంట వద్దకు అక్రమంగా విద్యుత్ వాడుకోవడంతో కాంట నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. ఇసుక కారుల వద్ద టిఎస్ ఎండిసి వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసి రోజు లక్షల్లో అక్రమంగా వసూలు చేస్తున్నారని, అయినప్పటికీ గ్రామస్తులు వే బ్రిడ్జి పై అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.