01-05-2025 09:00:27 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివాకర్ అన్న పెరుగన్నం కేంద్రాన్ని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.