01-05-2025 08:43:46 PM
జేఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక...
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో బుధవారం 179వ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. జెండా ఆవిష్కరించి నూతనంగా జేసి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ కమిటీ చైర్మన్గా టి.ఎస్.సింగ్, వైస్ చైర్మన్ గా జి.శ్రీనివాస్, కన్వీనర్ గా ఎస్ కిషోర్, కో కన్వీనర్ గా. వి ప్రభాకర్, రమేష్,రాములు, సిహెచ్ రమేష్, సలహాదారులుగా రవీందర్, కే ఆంజనేయులు, సిహెచ్ సారయ్య, భద్రయ్య,పి ఎల్ రావు, టి శ్రీనివాస్, రజిత, సురేఖ, వణజా రెడ్డి, ప్రభాకర్ బాబు సంధ్య మహేష్ తో పాటు తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ టి.ఎస్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచ కార్మికుల ఐక్యతను సూచించేదే కార్మిక దినోత్సవం అని, ఎందరో త్యాగాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న హక్కుల విలువనుమనంతెలుసుకోవచ్చు అని అన్నారు, మే 7న తెలంగాణఆర్టీసీలోజరగబోయే కార్మిక సమస్యలపై సమ్మె లోప్రతి కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.