01-05-2025 03:04:59 PM
100% ఉత్తీర్ణతసాధించిన బాలికల పాఠశాల
హుజురాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదలచేసిన పదవ తరగతి ఫలితాల్లో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదివే బాలికలు 100% ఉత్తీర్ణత సాధించారు. మంతెన వర్షిని 600 మార్కులకు గాను 524 మార్కులు సాధించింది, ఐదుగురు విద్యార్థులు 500 మార్కులు సాధించినారు. వర్షిని తండ్రి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు అతడు కట్టే మిషన్ లో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. తన కూతురు పాఠశాల టాపర్గా నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేశారు. వర్షినిని ప్రధానోపాధ్యాయురాలు బోరగాల తిరుమల పాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా వర్షిని మాట్లాడుతూ.. ఇంటర్లో బైపీసీ చదివి డాక్టర్ ఐ ప్రజలకు ఉచిత సేవ చేస్తానని తెలిపింది.