calender_icon.png 2 May, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుగంధర్ రావు కృషితో దేవాలయానికి 50 లక్షలు మంజూరు

01-05-2025 08:51:09 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామానికి శ్రీ కోదండ రామాలయం ఎండోమెంట్ ద్వారా మంజూరు కావడం జరిగింది. ఇట్టి మంజూరు కావడానికి ఎండోమెంట్ కు 10 లక్షల రూపాయల డిపాజిట్ అమౌంటుగా సూర్యాపేట జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు తన సొంత వ్యయం నుంచి డిపాజిట్ చేయడం జరిగింది. ఇట్టి అమౌంట్ ఆధారంగా రాష్ట్ర ఎండోమెంట్ గుడి మొత్తం 50 లక్షల మంజూరు చేయడం జరిగింది. గుడి నిర్మాణ పనులకు టెండరింగ్ కంప్లీట్ అయింది ఇట్టి  గుడి నిర్మాణ పనులు రాబోయే రోజుల్లో వేగమంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ గుడి మంజూరు కావడానికి కృషి చేసినందుకు మా గ్రామం తరపున పార్టీలకు అతీతంగా గుజ్జ దీపిక యుగంధర్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు.