calender_icon.png 2 May, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంశెట్టి నరేందర్ ను వరించిన శ్రమశక్తి అవార్డ్

01-05-2025 09:03:41 PM

సీఎం చేతుల మీదుగా అవార్డు స్వీకరణ...

మందమర్రి (విజయక్రాంతి): ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా శ్రమశక్తి అవార్డును సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్ అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గురువారం నిర్వహించిన మేడే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డు అందుకున్నారు. 139 వ మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికులకు విశిష్ట సేవలందించిన వివిధ కార్మిక నాయకులకు తెలంగాణ ప్రభుత్వ అత్యున్నతస్థాయి అవార్డు "శ్రమశక్తి" అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మంత్రుల చేతుల మీదుగా ప్రదానం చేశారు.

సింగరేణిలో మందమర్రి ఏరియాకు చెందిన కేకే 5 గనిలో అసిస్టెంట్ చైన్ మెన్ గా విధులు నిర్వహిస్తు ఐఎన్టియూసి మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కార్మిక వర్గానికి సేవలందిస్తున్న రాంశెట్టి నరేందర్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డును తీసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాననీ, తనకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ లకు రుణపడి ఉంటానని అన్నారు.

ఈ అవార్డు తన పై ఇంకా బాధ్యతను పెంచిందని, కార్మికుల న్యాయమైన హక్కులకై, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియూసి కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, కేంద్ర సంయుక్త కార్యదర్శి జగన్నాథ చారి, ఏరియా కార్యదర్శి దొరిశెట్టి చంద్రశేఖర్, నాయకులు శ్రీనివాస్, సంపత్, బాబు తదితరులు పాల్గొన్నారు.