calender_icon.png 2 May, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మేడే వేడుకలు

01-05-2025 08:41:33 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): మే డే సందర్భంగా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో బిఎన్ఆర్ కేఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు చంద్రం మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడతానని అన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు మహేష్, హనుమంతు, గోపాల్, రాములు, భూపతి, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.