calender_icon.png 2 May, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మేడే దినోత్సవం

01-05-2025 08:49:16 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తాలో కార్మికులతో కలిసి మే డే ఉత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... చికాగో అమరుల రక్తంతో తడిసి ఎర్రజెండాగా అవతరించింది అన్నారు. కార్మికులను 16 గంటలు పని చేస్తూ కట్టు బానిసలుగా తయారు చేస్తూ నీరంకుశంగా అణచివేస్తున్నందుకు నిరసనగా 1886లో అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించినారు. అట్టి రాలిపై పోలీసులు జరిపిన కాల్పులలో ఎంతోమంది కార్మికులు వీర మరణం పొందారన్నారు.

వారి పోరాట ఫలితంగా ప్రపంచమంతా ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చిందన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ 44 చట్టాలను నాలుగు కోడు లుగా మారుస్తూ కార్మిక హక్కుల్ని హరిస్తుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా సంగటితమై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను రక్షించుకొనటానికి సమరశీల పోరాటాలు చేయవలసిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్ల క్రమబద్ధీకరణ కోసం ఉద్యమిస్తామని తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, పిఎఫ్ , ఈఎస్ఐ, పెన్షన్ తదితర చట్టబద్ధత హక్కులను అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో రెడ్డి మల్ల ప్రకాశం, కళ్యాణం రవి, సునీల్, కార్మికులు పాల్గొన్నారు.