calender_icon.png 1 May, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడే వేడుకలు ఘనంగా నిర్వహించాలి

01-05-2025 12:30:23 AM

  1. ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్
  2. కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్రం ఉపసంహరించుకోవాలి 

మందమర్రి, ఏప్రిల్ 30: ప్రపంచ కార్మిక దినోత్సవం 139 వ మేడే ను సింగరేణిలో ఘనంగా నిర్వహించాలని. సభలు సమావేశాలు నిర్వహించి మేడే ప్రాముఖ్యతను నూతన ఉద్యోగులకు వివరించాలని సింగరే ణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. పట్టణంలోని యూనియ న్ కార్యాలయంలో బుధవారం నిర్వహించి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మి క వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టాల సవరణలు ఉపసంహరించుకోవాలని  అయన డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా మార్చడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ అధీనంలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

సింగరేణిలో నూతన బొగ్గు గనులు ఏర్పాటు చేయాలని తెలంగాణలోని బొగ్గు గనులు వేలం పాటలతో సంబంధం లేకుండా సింగరేణికి  కేటాయిం చాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీజనరల్ సెక్రటరీ ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్య నారాయణ  వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శన్, జాయింట్ సెక్రెటరీ కంది శ్రీనివాస్, బాణయ్య, మైనింగ్ స్టాప్ నాయకులు సత్యనా రాయణ, ములకలపల్లి వెంకటేశ్వర్లు, ఆంటోని దినేష్,ఎగ్గేటి రాజేశ్వరరావు, ఫిట్ కార్యదర్షులు గాండ్ల సంపత్, శర్మ, సంజీవ్ కుమార్, ఓదెలు, పారుపల్లి రాజేశం, గుమ్మడి సంపత్ లు పాల్గొన్నారు.