calender_icon.png 1 May, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో కందనూలుకు13వ స్థానం

01-05-2025 12:31:39 AM

  1. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి స్థానం
  2. సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీలు

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కందనూలు జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థానాన్ని కైవసం చేసుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మొదటి స్థానం కైవసం చేసుకుంది. బుధవారం విడుదలైన 10 ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థులు 96.83 శాతం ఉత్తీర్ణత సాధించారు.

గతేడాది 91.57 శాతం ఉత్తీర్ణత సాధించి 23వ స్థానంలో నిలువగా ఈ ఏడాది 96.83 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో నిలిచి ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే గత 8 ఏళ్లుగా మొదటి వరుసలో నిలుస్తోంది. వంద పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు. ! జిల్లాలోని 60 ప్రభుత్వ పాఠశాలలో మరో నలభై ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు పది ఫలితాల్లో100% ఉత్తీర్ణత సాధించారు.

మొత్తంగా 10,530 మంది విద్యార్థులకు గానూ 10,196 ఉత్తీర్ణులయ్యారు. 20 కేజీబీవీలో 10 కేజీబీవీలు 100% ఉత్తీర్ణత సాధించగా మరో 10 కేజీబీవీలు 98 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించాయి. 131ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 30కిపైగా పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. 5230 మంది బాలురు, 5300 మంది బాలికలు కలిపి 10,530 మంది పరీక్షలు రాయగా బాలురు 5013 (95.85 శాతం) మంది, బాలికలు 5183 (97.79 శాతం) అధిక ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ పాఠశాలలో కేజీబీవీ పాఠశాలల్లోనే అత్యధికంగా పేద విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు.