calender_icon.png 29 September, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గా మాత ఆశ్శీస్సులు అందరిపై ఉండాలి

29-09-2025 12:44:07 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్, సెప్టెంబర్ 28:  దుర్గా మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని మహబూబ్ నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ నగరం కొత్త చెరువు రోడ్ లో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ప్రతిష్టించిన దుర్గా మాతను ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో దుర్గా మాతనకు విశేషపూజలు నిర్వహిస్తున్న.

మీ అందరి కోరికలు అమ్మవారు తీర్చాలని కోరారు.  అనంతరం రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కొత్త చెరువు రోడ్ లో ప్రతిష్టించిన దుర్గా దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు రామకృష్ణ, ఖాజా పాషా, రాషెద్ ఖాన్, నాయకులు జేసిఆర్, బండ్ల గేరి శ్యాం తదితరులు పాల్గొన్నారు.