29-09-2025 12:43:29 AM
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
పటాన్ చెరు, సెప్టెంబర్ 28 :తెలంగాణ ఆడపడుచులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే సద్దుల బతుకమ్మ సందర్భంగా సోమవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై భారీ ఎత్తున సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం సాకి చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మహిళలందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.