calender_icon.png 14 May, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి

14-05-2025 12:26:36 AM

- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

దౌల్తాబాద్, మే 13: అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో ఎల్లమ్మ సిద్ధియోగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం గౌడ కులస్తులు శాలువతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి గ్రామదేవతలు ఎంతో ముఖ్యమని గ్రామ దేవతలను పూజిస్తే గ్రామ ప్రజలు కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని అన్నారు. వచ్చే వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు అధికంగా పండి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

అనంతరం అక్బర్ పేట భూంపల్లి మండలం పోతిరెడ్డిపేటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలను, ధర్మాజీపేట వార్డుకు చెందిన నాంపల్లి గౌడ్ కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రహీముద్దీన్, తాజా మాజీ సర్పంచ్ చిత్తారి గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు నాగరాజు గౌడ్, రాజలింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు..