02-09-2025 12:43:00 AM
ఇల్లెందు,(విజయక్రాంతి): కరాటే పోటీల్లో ఇల్లందు మైనార్టీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధించారు. హైదరాబాద్, మెదక్, కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం వంటి జిల్లాల విద్యార్థులు ఇటీవల జరిగిన పోటీలలో విజయాలు సాధించి, జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. వివిధ పోటీలలో విద్యార్థుల విజయాలు జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆగస్టు 2025లో హైదరాబాద్‌లోని రెంజుకి షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన విద్యార్థులు పతకాలు సాధించారు.
ఇల్లందు లోని మైనారిటీ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించినందుకు గాను సోమవారం ఇల్లందు ఎస్ హెచ్ ఓ తాటిపాముల సురేష్ హైదరాబాదులో జరిగిన ఈ కరాటే పోటీల్లో విద్యార్థులు సాధించిన షీల్డ్, సర్టిఫికెట్లు వారికి అందజేసి అనంతరం మాస్టర్ సంపత్ ను అభినందించాడు.