14-05-2025 12:27:14 AM
హుజూర్ నగర్, మే 13: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హుజూర్ నగర్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీఆర్ వి కెయస్ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ కంపెనీ కార్యదర్శి పి కరెంట్ రావు డివిజన్ ఆఫీస్ ముందు ఏర్పాటుచేసిన జెండాను ఆవిష్కరించి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.
విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్ లో కన్వెన్షన్ కోసం టీఆర్ వి కెయస్యూనియన్ ఎల్లవేళల కృషి చేస్తుందని తెలియజేశారు.2023 జేయల్యం బ్యాచ్ పే వ్యత్యాసాన్ని సరి చేయుటకు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నామని, త్వరలో జరగబోయే సబ్ ఇంజనీరింగ్ స్క్రీనింగ్ టెస్ట్ లో కూడా మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చే విధంగా యాజమాన్యంతో మాట్లాడి కృషి చేస్తామని, ప్రధానంగా ఈపియఫ్ టు జీపీయప్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పోతురాజు రమేష్ బాబు, పిమల్లికార్జున్,బి.విశ్వనాథ చారి,మహిళాప్రతినిధులు,డివిజన్ కార్యవర్గ సభ్యులు,సబ్ డివిజన్ లీడర్లు, సెక్షన్ లీడర్లు,కార్మిక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.