02-09-2025 12:47:52 AM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు పాటించాలని, నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. పట్టణ పరిధిలోని పలు గణేష్ మండపాలను పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో ప్రశాంతవంతమైన వాతవరణంలో గణపతి నవరాత్రులు కోనసాగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2100 వినాయక మండపాలు కొలువుదీరినవని,అట్టి మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ వారిచే సూచించబడిన సూచనలు తప్పక పాటించాలన్నారు.వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవలన్నారు.
నిమజ్జనం రోజున.ఎట్టి పరిస్థితుల్లో డి.జే లకు అనుమతి లేదని నిబంధనలకు విరుద్ధంగా డి.జే లు ఏర్పాటు చేసిన డి.జే యజమానులతో పాటుగా మండపాల నిర్వహకులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.మండపాల నిర్వహకులు నిర్దేశించిన సమయనికి నిర్జనం పూర్తి అయ్యేలా ప్రణాళిక చేసుకోవాలని, పోలీస్ సలహాలు సూచనలు తప్పక పాటిస్తూ ఏలాంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.ఎలాంటి సమస్యలు తలెత్తిన, అవాంచనీయ సంఘటనలు జరిగిన వెంటనే పోలీస్ వారికి సమాచారం అందింవ్వాలని తెలిపారు.