24 August, 2026 | 1:02 AM

అమ్మవార్ల ఆశీస్సులు అందరిపై ఉండాలి

24-08-2026 12:27 AM

పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్‌గుప్త

న్యూమారుతినగర్‌లో ఘనంగా బోనాలు

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): న్యూమారుతినగర్ రోడ్ నంబర్ 5లోని శ్రీరేణుకాదేవి (ఎల్లమ్మ),విజయదుర్గాదేవి సమేత అమ్మవార్ల బోనాల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన పీసీసీ ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఐవీఎఫ్ ప్రధమ మహిళ ఉప్పల స్వప్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.

అమ్మవార్లకు బోనాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. జాతరను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. శ్రీదేవి, రేణుకాదేవి, విజయదుర్గాదేవి పాసకురాలు, గురుమాత సోమ వెంకటమ్మ మాట్లాడుతూ అమ్మవార్ల బోనాల జాతరను ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు. అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆకాంక్షించారు.