calender_icon.png 29 September, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలి

29-09-2025 12:42:53 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ రూరల్, సెప్టెంబర్ 28: దుర్గామాత కృపా కటాక్షాలు అందరిపై మెండుగా ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మహబూబ్ నగర్ నగరం లోని ఏనుగొండ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గా మాతను ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రజలంతా దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పెద్ద గొల్ల నరసింహులు శ్రీధర్ గౌడ్ , కుమార్ గౌడ్ , పరమానంద గౌడ్, పెద్ద గొల్ల తిరుపతయ్య, వెంకటేష్ యాదవ్, ఈడిగి పురుషోత్తం మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు రాషెద్ ఖాన్, ఖాజా పాషా, మోసిన్, అంజద్ తదితరులు పాల్గొన్నారు.