29-09-2025 12:42:29 AM
చేగుంట, సెప్టెంబర్ 28 :చేగుంట మండల కేంద్రంలోని తపస్ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ భారతదేశ దాస్య సుంకలాల విముక్తికై ప్రాణాలను తృణపాయంగా అర్పించి, ఉరికంబంపై గర్జించి, ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చేగుంట, నార్సింగి మండలాల అధ్యక్షులు రావుల వెంకటేష్, తీగుళ్లస్వామి, తపస్ చేగుంట మండల ప్రధాన కార్యదర్శి తంగేళ్లపల్లి కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్, దేవానంద్ తదితరులుపాల్గొన్నారు.