calender_icon.png 27 July, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌యూను మరింత అభివృద్ధి చేస్తాం

27-07-2025 12:26:23 AM

- సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్

- బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జూలై 26 (విజయక్రాంతి): కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం శాతవాహన యూనివర్సిటీలోని పరిపాలన విభాగం మొదటి అంతస్తుకు 9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అంతర్గత నీటి సరఫరా పైపులైన్ ఏర్పాటు కోసం శంకుస్థాపన, లెనోవేషన్ చేసిన ఆడిటోరియాన్ని ప్రారంభించా రు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో విద్య కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ, యంగ్ ఇండియా స్పోరట్స్ వర్సిటీ, ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంద న్నారు.

ఏ భాషకు మేము వ్యతిరేకం కాదని అన్ని నేర్చుకోవాలని, కాంపిటీటివ్ ముందు కు వెళ్లాలంటే ఇంగ్లీష్‌లో శిక్షణ పొందాలన్నారు. శాతవాహన యూనివర్సిటీకి ఫార్మ సీ, లా, ఇంజనీరింగ్ కాలేజీ వచ్చాయని, జిల్లా మంత్రలు, ఎమ్మెల్యేలు యూనివర్సిటీకి అభివృద్ధి చేస్తున్నామన్నారు. సామాజిక న్యాయం అందించడంలో కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అని అన్నారు. బడుగు బలహీ న వర్గాలకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు అవకాశాలను ఇచ్చిందన్నారు. బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన బిజెపి క నీసం శాసనసభ పక్ష నాయకుని కూడా బీసీలకు ఇవ్వలేకపోయిందన్నారు.

ఉన్న బలహీ న వర్గాల అధ్యక్షుడు బండి సంజయ్‌ని అకారణంగా తొలగించి.. వేరే వాళ్ళని నియమిం చారని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇటీవల ముగ్గురు మంత్రులను సామాజిక న్యాయం ద్వారా కేటాయించారని తెలిపారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కరుడుగట్టిన బడు గు బలహీనవర్గాల వ్యతిరేకి రాంచందర్‌రావును బీజేపీ అధ్యక్షుడిని చేశారని విమర్శిం చారు. కిషన్‌రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి అరవింద్, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్యలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ కుట్రలను బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవని తెలిపారు.

బలహీన వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు హిం దువులు, ముస్లింల పేరు మీద డైవర్షన్ లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉన్న దానిని ఆమోదింపజేయాలని సూచించారు. మంత్రి వెంట చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.