calender_icon.png 10 January, 2026 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి

07-01-2026 01:17:25 AM

  1. మహిళల భద్రతలో షీ టీమ్స్ కీలక పాత్ర
  2. ఏడీజీపీ చారుసిన్హా 

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని అడిషనల్ జనరల్ పోలీస్ చారుసిన్హా సూచించారు. హైదరాబాద్ గన్‌ఫౌండ్రిలోని రోజరీ కాన్వెంట్ హైస్కూల్‌లో క్రీడాదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏడీజీపీ చారుసిన్హా హాజరై మాట్లాడారు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ అనుసరిస్తున్న విధానాలు, మహిళలపై జరుగుతున్న వేధింపుల ను ఆరికట్టడంలో షీ టీమ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆడపిల్లలు ఎవరికి భయపడ కుండా ఆత్మనిర్బరతను సాధించాలని ఆమె దిశానిర్దేశం చేశారు.

రోజరీ కాన్వెం ట్స్ స్కూ ల్ ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జోసెఫిన్ మాట్లాడుతూ1904లో స్థాపించబడిన రోస రీ కాన్వెంట్ హైస్కూల్ విద్యాప్రతిభకే కాకుం డా మేథస్సును వికసింపజేసే, వ్యక్తిత్వాన్ని మలిచే సంపూర్ణ విద్యను అందిస్తుందని తెలిపారు. క్రీడల్లో గెలుపే ముఖ్యం కాదని, పాల్గొనాలే ప్రయత్నమే ప్రధానమన్నారు. విద్యార్థినులు ఆత్మ విశ్వా సం పెం పొందించుకోవాలని ఆమె సూచించారు.

పాఠశాలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శనలు వివిధ రకాల క్రీడలు, విన్యాసాలు, రోబో డ్రిల్, దేశ చిత్రపటం, నౌక, విమానం చిత్రాల ఏర్పాటుతో పాటు భారతీయ సంస్కృతికి ప్రతిరూ పమైన భరతనాట్య నృత్య ప్రదర్శనలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అంతర్జాతీయ టేబుల్ టెన్ని స్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహిత శ్రీజ, సెయింట్ జోసెఫ్ కేథడ్రాల్ మతగురువు రెవరెండ్ ఫాదర్ ఆరోగ్య స్వామి, ఎఫ్‌ఎంఎప్ స్కూల్ ప్రధాన కార్యదర్శి అన్నమేరి పాల్గొన్నారు.