07-01-2026 04:04:51 PM
హైదరాబాద్: బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీ ప్రజలకు భారమైందని, ఆ పార్టీతో ఉపయోగం లేదని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Medak MP Raghunandan Rao) బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ప్రస్తుతం ఆ కుటుంబసభ్యులకే నచ్చటం లేదని విమర్శించారు. కుటుంబంతో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటామని రఘునందన్ వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజలు నమ్మకం కోల్పోయారని సూచించారు. రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చేది.. బీజేపీ అని రఘునందన్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును(Phone tapping case) ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారని ఆయన ప్రశ్నించారు. ఎంతమందిని పిలిచి విచారణ చేసినా... వేళ్లన్ని ఒకవైపు చూపిస్తున్నాయని చెప్పారు. వేళ్లన్ని ఒకరివైపే చూపినా.. ఆయన జోలికి వెళ్లటం లేదని ఆరోపించారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తారా అని.. స్వయంగా కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కూతురు ప్రశ్నించిందని తెలిపారు. సిట్ కాస్తా.. కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లాగా అయిందని వ్యాఖ్యానించారు. 650 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని సర్వీస్ ప్రొవైడర్లే చెప్పారని రఘునందన్ వివరించారు.