calender_icon.png 4 July, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర

03-07-2025 01:07:20 AM

పూజారుల సంఘం ప్రకటన

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతరను 2026 జనవరి 28 నుంచి 31 తేదీ వరకు నిర్వహించను న్నారు. ఈ మేరకు బుధవారం పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకు వస్తారు. 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటుంది.

30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. జాతర తేదీల ప్రకటనపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. పూజారుల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు.

మేడారం జాతరకు సంబంధించిన పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించా రు. రూ.110 కోట్లతో మేడారంలో అభివృద్ధి పను లు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. మేడారం జాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నా రు. కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు.