calender_icon.png 4 July, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటిన మొక్కను సంరక్షించాలి

03-07-2025 01:07:58 AM

ఎమ్మెల్యే డా.హరీష్‌బాబు

కాగజ్‌నగర్, జూలై 2(విజయ క్రాంతి): నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఎమ్మె ల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని బలగలలో గల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల2లో బుధవారం విద్యార్థులతో కలిసి  హరీష్‌బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు నడుం బిగించాలని కోరారు.

  మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లే రోడ్డు మార్గం బాగాలేదని ప్రిన్సిపల్ తెలియజేయడంతో  పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ ఓ కోట ప్రసాద్, ఆర్‌ఎల్సి పుష్పలత, డిఎండబ్లు నదీమ్, ప్రిన్సిపల్ షగుఫ్తా, పంచాయ తీ కార్యదర్శి హరీష్ పాల్గొన్నారు.