calender_icon.png 5 July, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల పెట్టుబడి సాయాన్ని అడ్డుకోవద్దు

03-07-2025 01:06:27 AM

బ్యాంకర్లకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచన

ఆదిలాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టుకుంటున్న సమయంలో బ్యాంకర్లు పెట్టుబడి సాయాన్ని ఆపవద్దు అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండ లం అంకోలిలోని బ్యాంకులో రైతులకు పడ్డ రైతుభరోసా డబ్బులను అప్పుకింద కట్ చేసుకుంటున్నారని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుధవారం రైతులతో కలిసి బ్యాం కును సందర్శించారు.

ఈ సందర్భంగా బ్యాం కు అధికారులతో మాట్లాడి రైతు భరోసా, ఉపాధి హామీ డబ్బులను అప్పుల కింద కట్ చేయవద్దని ఇటీవల బ్యాంకర్ల సమావేశంలోని నిర్ణయించారని అధికారుల కు ఎమ్మె ల్యే తెలిపారు. ఇలాంటి చర్యలు తీసుకుంటే సంబంధిత బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు దయాకర్, శ్రీకాంత్, అశోక్, సాయిగౌడ్,  ఆశన్న, రాజన్న పాల్గొన్నారు.