24 July, 2026 | 2:47 AM

వసతిగృహాల్లో విద్యార్థులకు వైద్యపరీక్షలు

24-07-2026 12:53 AM

సీజనల్ వ్యాధులపై, విద్యార్థులకు అవగాహన

ఎల్లారెడ్డి జులై 23 (విజయక్రాంతి) సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల విద్యార్థులకు మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శరత్ కుమార్ అవగాహన కల్పించారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని వసతిగృహం లో ఉంటున్న విద్యార్థులు, పట్టణంలోని బీసీ ఎస్సీ ఎస్టీ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. విద్యార్థులకు, చిన్నచిన్న రుగ్మతలకు, వైద్యం అందించి మాత్రలు పంపించేశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహ నిర్వాహకులు మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.